గుజరాత్ వ్యాపారి మహేశ్ షా తరహాలోనే అసోంలో ఓ రైతు వ్యవహారం వార్తలకు ఎక్కింది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) కింద ఏకంగా రూ. 13,860 కోట్లు వెల్లడించి మహేశ్ షా కటకటాలు లెక్కిస్తుండగా.. అసోంకు చెందిన రైతు జింటూ బోరా వద్ద ఏకంగా 37 బ్యాంకు, పోస్టాఫీస్ పాస్‌బుక్కులు, 44 ఏటీఎం కార్డులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.
మజులీ జిల్లాలోని మధుపూర్ గ్రామానికి చెందిన బోరా ఇంటిపై పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించగా.. 44 బ్యాంకు, పోస్టాఫీస్ పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు దొరికాయి. దీంతోపాటు 34 చెక్కుబుక్కులు, 200 బ్లాంక్ చెక్కులు, రూ. 22,380 నగదు, కొన్ని బ్లాంక్ స్టాంపు పేపర్లు దొరికాయి. తాను పలువురికి అప్పులు ఇచ్చానని, అందుకు తాకట్టుగా బ్యాంకుల పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు పెట్టుకున్నట్టు బోరా చెబుతుండగా, బ్యాంకుల్లో నల్లధనాన్నివేసేందుకే వీటిని సేకరించి ఉండొచ్చునని తాము అనుమానిస్తున్నట్టు ముజులి ఎస్పీ వైభవ్‌చంద్రకాంత్ నింబల్కర్ తెలిపారు. అయితే, ఆయన వద్ద రద్దైన నోట్లు ఏమీ దొరలేదని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

No comments:
Post a Comment