Friday, 23 December 2016

మంత్రులకు తప్పిన ముప్పు

కామవరపుకోట:
పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం మంత్రులు ప్రయాణిస్తున్న వాహనాలు పరస్పరం ఢీకొనడంతో నలుగురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి.

జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కామవరపుకోట వద్ద మంత్రుల కాన్వాయ్‌ కు గొర్రెల మంద అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment