Tuesday, 20 December 2016

ఐటీకి పట్టుబడిన మొత్తమెంతో తెలుసా?

దిల్లీ:
దేశంలో పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా నల్లకుబేరుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.3,185 కోట్లు లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించారు. నవంబర్‌ 8 నుంచి ఈ నెల 19వరకు దేశవ్యాప్తంగా 677 చోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.86కోట్ల విలువైన కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పన్నుఎగవేత ఆరోపణలు, హవాలా ఒప్పందాలకు సంబంధించి ఐటీశాఖ అధికారులు 3100 నోటీసులను జారీచేశారు.
డిసెంబర్‌ 19వరకు ఐటీశాఖ అధికారులు రూ.428 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకోగా వాటిలో రూ.86కోట్లు విలువైన కొత్తనోట్లే ఉండటం గమనార్హం.

వీటిలో ఎక్కువ మొత్తం కొత్త రూ.2000 నోట్లే ఉన్నట్లు గుర్తింతించారు.

No comments:

Post a Comment