Wednesday, 14 December 2016

‘ఓలా’ స్పెషల్‌ ఆఫర్‌!

న్యూఢిల్ల:
ఆన్‌లైన్‌ క్యాబ్‌ సేవల సర్వీస్‌ ‘ఓలా’ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది దేశ జధాని న్యూఢిల్లీలో వినియోగదారులు ‘ఓలా షేర్‌’  ఆఫర​ ద్వారా కేవలం రూ. 50లకే క్యాబ్‌ను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతమంతటా ఉన్న 150 మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని ఏడు కిలోమీటర్ల వరకు కేవలం రూ. 50 చార్జితో ప్రయాణించవచ్చు. ’ఓలా షేర్‌’లో భాగంగా ఏడు కిలోమీటర్లు దాటితే మామూలు చార్జీలు వర్తిస్తాయి.

ఈ స్పెషల్‌ చార్జీలతో ప్రతి ఒక్కరికీ అనుసంధానం కావాలన్నదే తమ లక్ష్యమని, వాతావరణం సరిగ్గా లేనప్పుడు, ట్రాఫిక్‌ తీవ్రంగా ఉన్నప్పుడు అందుబాటు ధరల్లో క్యాబులు లేకపోవడంతో ప్రయాణికులు చిక్కులు ఎదుర్కొంటున్నారని, వారికి కూడా సేవలు అందించేందుకు ఈ స్పెషల్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్టు ఓలా నార్త్‌ బిజినెస్‌ హెడ్‌ దీప్‌ సింగ్‌ తెలిపారు. ఈ స్పెషల్‌ ఆఫర్‌ సోమవారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్తిస్తుందని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment