కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్
దాద్రి:
నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘నవంబర్ 8వ తేదీ నుంచి ప్రధాని మోదీ పేద ప్రజలపై యుద్ధం చేస్తున్నారు. ధనికులెవరైనా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎం ఎదుట నిలబడటం చూశారా?’ అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో పర్యటించిన ఆయన నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అక్కడి మార్కెట్ యార్డులో రైతులను అడిగి తెలుసుకున్నారు.
‘నోట్ల రద్దు గురించి ప్రధాని రోజుకో మాట మాట్లాడుతున్నారు. మొదట నల్లధనంపై పోరాటం అన్నారు, తర్వాత ఉగ్రవాదం.. ఇప్పుడేమో నగదు రహిత సమాజం కోసం పోరాటం చేస్తున్నామని మోదీ అంటున్నారు. నగదు రహిత సమాజంపై ఆయన మాట్లాడుతున్నారు, కానీ నోట్ల రద్దు వల్ల సమాజంలో అవసరానికి కూడా నగదే లేకుండా పోయింద’ని రాహుల్ అన్నారు.
కొందరు వ్యాపారవేత్తలు బ్యాంకు నుంచి రూ.8లక్షల కోట్లు రుణంగా తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించడం లేదు. రుణాలు ఎగ్గొడుతున్న వారి నుంచి వసూలు చేయడానికి కఠిన చర్యలు చేపట్టకుండా సామాన్య ప్రజలను క్యూల్లో నిలబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అడ్డుకునేందుకు నోట్ల రద్దు అన్నారు.. కానీ భద్రతా సిబ్బంది పట్టుకున్న మిలిటెంట్ల దగ్గర కొత్త నోట్లు లభ్యమవుతున్నాయి, దీనికేం సమాధానం చెప్తారని రాహుల్ ప్రశ్నించారు. 50 రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే, ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందన్నారు.

No comments:
Post a Comment