నెల్లూరు :
బంగారం వ్యాపారి భార్య తన ఇంట్లోనే చోరీకి పాల్పడి కటకటాలపాలైన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన శంకర్ బంగారం వ్యాపారి. అతడు వ్యాపారం నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్తుండడంతో మరో వ్యాపారి రంజిత్ వద్ద బంగారు ఆభరణాలను దాచి ఉంచుతాడు. అందులో భాగంగా సుమారు కిలోన్నర బంగారాన్ని రంజిత్ దగ్గర ఉంచాడు.
ఈనెల 4న రంజిత్ ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీలో శంకర్ ఇచ్చిన బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంజిత్ భార్య పూజాజైన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన తన పాత మిత్రుడు రమీద్‌షాతో కలిసి వాటిని చోరీ చేసినట్లు నిర్ధారించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ సంజయ్ తెలిపారు.

No comments:
Post a Comment