న్యూఢిల్లీ:
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాత నోట్లు డిపాజిట్ చేయడంపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. రూ.ఐదువేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ నిబంధన పెట్టింది. దీని ప్రకారం ఓ వ్యక్తి ఒక్కసారి మాత్రమే రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా, గతంలో ఈ పాత నోట్లను ఎందుకు జమ చేయలేదని, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి, అది వారిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కేవైసీ పత్రాలు ఉంటేనే తీసుకోవాలని, లేదంటే కేవలం 50 వేలు మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని కూడా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. అలాంటి పరిస్థితి ఏర్పడిన ఖాతాలను అధికారులు ఒకసారి పునఃపరిశీలించాలని కూడా చెప్పింది. థర్డ్ పార్టీ ఖాతాలో డబ్బు వేయాలని భావించినప్పుడు వారి నుంచి అనుమతి తీసుకున్నట్లుగా ఆధారం చూపించే జమ చేయాల్సి ఉంటుందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.

No comments:
Post a Comment