Monday, 12 December 2016

ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్‌, డీజిల్‌ పై డిస్కౌంట్

న్యూఢిల్లీ:

 వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట ఈ అర్ధరాత్రి  నుంచి అమల్లోకి రానుంది. డిజిటల్‌ చెల్లింపుల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకునే వారికి 0.75 శాతం రాయితీ ఇవ్వనున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీ ప్రకటించింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల, ఈ-వాలెట్లు లేదా మొబైల్‌ వాలెట్లు ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది.


లీటరు పెట్రోల్‌ పై 49 పైసలు, లీటరు డీజిల్‌ పై 41 పైసలు రాయితీగా ఇస్తారు. కార్డు ద్వారా చెల్లించిన మూడు రోజుల తర్వాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడగాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 66.10, డీజిల్‌ ధర రూ.54.57గా ఉంది.

పాత పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు పూర్తైన సందర్భంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నెల 8న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‌

No comments:

Post a Comment