Monday, 12 December 2016

ఆ మేకకు దివ్యశక్తులు ఉన్నాయట!

భోపాల్ :

మధ్యప్రదేశ్‌లో రెండు నెలల వయసున్న మేకకు దివ్యశక్తులు ఉన్నాయంటూ దాన్ని అంతా పూజిస్తున్నారు. అక్కడ ఖర్గోన్ జిల్లాలోని బిరోతి గ్రామంలోని ఈ మేక నెల రోజుల వయసు ఉన్నప్పటి నుంచే పాలివ్వడం మొదలుపెట్టింది. ఆ మేకపిల్ల తన తల్లి వద్ద పాలు తాగడంతో పాటు.. అది కూడా పాలిస్తోంది. లక్షల్లో ఒకదానికి మాత్రమే ఇలాంటి లక్షణాలుంటాయని, దీనికి ఏదో దివ్యశక్తులు ఉండటం వల్లే ఇలా చేస్తోందని భావించి స్థానికులంతా ఆ మేకపిల్లను పూజించడం మొదలుపెట్టారు.

తాను పెంచుకుంటున్న మేకపిల్ల ఇంత ఫేమస్ కావడంతో దాని యజమాని సఖీ బాయ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కానీ.. హార్మోన్ల ప్రభావం వల్ల అరుదుగా కొన్ని మేకల్లో ఇలా జరుగుతుందని, ఇందులో దివ్యశక్తులు ఏమీ లేవని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా జనం మాత్రం దాన్ని పూజించడం మానలేదు.

No comments:

Post a Comment