న్యూఢిల్లీ:
భారత్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. భారత్‌లోని మొబైల్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ఫోన్లను ఏ మేరకు వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్ (ఎమ్‌ఎమ్‌ఏ), పరిశోధన సంస్థ ఐఎమ్‌ఆర్‌బీ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించి నివేదికను బుధవారం విడుదల చేశాయి.
స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు, ఆటల కోసం పురుషుల కంటే రెండు రెట్లు అధికంగా మహిళలు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారని వెల్లడైంది. అంతేకాకుండా పురుషుల కంటే స్త్రీలు 80 శాతం ఎక్కువగా ఫేస్‌బుక్‌లో సమయాన్ని వెచ్చిస్తారని తెలిపాయి. ప్రతిరోజు టీవీలు, ఇతర మాధ్యమాల కంటే అధికంగా దాదాపు మూడు గంటలపాటు సగటున ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.

No comments:
Post a Comment