Friday, 16 December 2016

నోట్ల మార్పిడి పేరుతో మోసం : ఎస్‌ఐ అరెస్ట్

మనోహరాబాద్:

రంగారెడ్డి జిల్లాలో నోట్ల మార్పిడి పేరుతో మోసానికి పాల్పడ్డ ఓ ఎస్ ఐను తూప్రాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోహరాబాద్ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌ ఓ ముఠాను ఏర్పాటు చేసి నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడ్డాడు.

స్థానికంగా కొందరు వ్యక్తుల నుంచి కోటి రూపాయల దాకా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మోసానికి పాల్పడినట్టు రుజువు కావడంతో ఎస్ ఐతో పాటు మరో నలుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలించారు.

No comments:

Post a Comment