భోపాల్:
ఎన్ని హెచ్చరికలు వచ్చినా, పోలీసుల తనిఖీలు జరుగుతున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఏం చక్కా కొత్త నోట్లను ముద్రిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కిపోయారు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చుయంత్రాన్ని ఓ స్కానర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రూ.2000 నోట్లను మధ్యప్రదేశ్‌లోని షాడోల్ లో ఓ ప్రాంగణంలో ముద్రిస్తున్నారు. ఇప్పటికే చాలా నోట్లను ముద్రించారు కూడా.
పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లలో అప్పుడే దొంగనోట్లు వస్తున్నాయని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గతంలో నకిలీ నోట్లను ముద్రిస్తూ పట్టుబడిన వారి సహాయంతో గాలింపులు చేపడుతున్న పోలీసులు చివరకు ఓ ఇద్దరు వ్యక్తులను షాడోల్ లో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరైనా ఉండి ఉంటారా అనే వివరాలను తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.

No comments:
Post a Comment