Wednesday, 23 November 2016

కేసీఆర్ బాత్‌రూం గురించి తెలిస్తే అవాక్కే!

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త నివాసం నిర్మాణం విషయంలో గట్టి జాగ్రత్తలే తీసుకున్నారు. దాదాపు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో నిర్మించిన బాత్‌ రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్‌ లతో నిర్మించారు. స్నానాల గదులకు ఏర్పాటుచేసిన కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను బిగించారు. అలాగే, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కోసం నిర్మించిన బెడ్రూంలకు కూడా అత్యంత క్వాలిటీ ఉన్న దళసరి గాజు ఫలకాలను బిగించారు.

వీటి విలువ దాదాపు లక్షల్లోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జెడ్ ప్లస్ కేటగిరీని తలదన్నేలా రక్షణ చర్యలు కొత్త నివాసం నిర్మాణంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకే ఇలా బుల్లెట్ ప్రూఫ్ చర్యలను తీసుకున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు కేసీఆర్ నూతన గృహ ప్రవేశం చేయనున్న విషయం తెలిసిందే. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. ఆర్ అండ్ బీ విభాగం రూ.38 కోట్ల అంచనా వ్యయంతో 3 బ్లాక్‌లుగా ఈ నిర్మా ణాలు చేపట్టింది. దాదాపు వెయ్యిమందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మించారు. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలను సేకరించి ఇక్కడ పెంచే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగించారు. తొమ్మిది నెలల్లోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు.

No comments:

Post a Comment